- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సామాజిక తనిఖీ జరిగినట్లుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సామాజిక తనికి బృందం సభ్యులు చల్ల రవీందర్ హాజరై పాఠశాలలోని పలు అంశాలను పరిశీలించారన్నారు.అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ సభ్యులు,విద్యార్థుల తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం పాఠశాల,సమగ్ర శిక్షా ఇతర అంశాలపై ఆరా తీసినట్లుగా తెలిపారు.ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు,ఉపాధ్యాయులు జగన్ నాయక్,స్వర్ణలత,శ్రీదర్,రమేష్,రాజేందర్, శ్రీనివాస్, మహేష్,వినోద్,మల్లయ్య పాల్గొన్నారు.
- Advertisement -



