Monday, May 11, 2026
E-PAPER
Homeజాతీయంత‌మిళ‌నాడులో కొత్త ఎమ్మెల్యేల ప్ర‌మాణ‌స్వీకారం

త‌మిళ‌నాడులో కొత్త ఎమ్మెల్యేల ప్ర‌మాణ‌స్వీకారం

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఆదివారం టీవీకే అధినేత విజ‌య్ సీఎంగా ప్ర‌మాణస్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. అంతేకాకుండా అధికార పార్టీతో పాటు ప్ర‌తిప‌క్షపార్టీల ఎమ్మెల్యేలు ప్ర‌మాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఎడప్పాడి కె పళనిస్వామి, ఓ పన్నీర్‌సెల్వం, ఉదయనిధి స్టాలిన్ వంటి ప్రముఖ నాయకులతో పాటు, తమిళనాడు మంత్రులైన ఎన్ ఆనంద్, ఆదవ్ అర్జున, కెజి అరుణ్‌రాజ్, కెఎ సెంగోట్టయ్యన్ కూడా ఉన్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి ముందు, తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ ఎంవి కరుప్పయ్య ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీవీకే 108,కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఐ(ఎం)2 డీఎంకే 59, అన్నా డీఎంకే 47 స్థానాలు సాధించాయి. వామ‌ప‌క్షాల‌తో పాటు కాంగ్రెస్ భాగ‌స్వామ్యంతో టీవీకే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -