Monday, May 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఐపీఎస్ భార్య హ‌త్య..ప‌నిమ‌నిషి క‌ల్ప‌న అరెస్ట్‌..?

ఐపీఎస్ భార్య హ‌త్య..ప‌నిమ‌నిషి క‌ల్ప‌న అరెస్ట్‌..?

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఐపీఎస్ భార్య హ‌త్య కేసులో కీల‌క పురోగ‌తి సాధించారు పోలీసులు. మొత్తం 10 బృందాల‌తో గాలింపు చ‌ర్య‌లు చేపట్టిన అధికారులు..హ‌త్య‌లో కీల‌క పాత్ర పోషించిన ప‌నిమ‌నిషి క‌ల్ప‌న‌ను అరెస్ట్ చేసిన‌ట్లుగా స‌మాచారం.మహారాష్ట్రలోని పుణెలో ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ కేసును సీరియస్‌‌గా తీసుకున్న పోలీసులు.. నేపాలీ గ్యాంగ్ కోసం హైదరబాద్, పుణె, ముంబై, ఢిల్లీ, బిహార్‌కు ప్రత్యేక బృందాలను పంపించారు. అలాగే నిందితులు సరిహద్దు దాటి నేపాల్‌కు వెళ్లకుండా జల్లెడ పట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. కల్పన పుణేలో ఉన్నట్లు వారు పోలీసులకుతెలిపారు. దీంతో ప్రత్యేక బృందాలు పుణేకి వెళ్లి.. కల్పనను పట్టుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -