- Advertisement -
- – కేంద్ర ప్రభుత్వమే దళిత క్రైస్తవుల తరఫున సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ కి వెళ్ళాలి
– 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలి - – కేవిపిఎస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రముఖ సీనియర్ అంబేద్కర్ వాదులు డా. జె బి రాజు, డా. అప్పికట్ల భరత్ భూషణ్
- నవతెలంగాణ – హైదరాబాద్ : 2026 మార్చి 24న దళితులు క్రైస్తవాన్ని స్వీకరిస్తే రాజ్యాంగపరమైన హక్కులు ఎస్సీ హోదా రద్దవుతుందని సుప్రీంకోర్టు 33 పేజీల తీర్పు కోట్లాదిమంది దళితుల గుండెపై దాడి చేసిందని ప్రముఖ సీనియర్ అంబేద్కర్ వాదులు డాక్టర్ జె బి రాజు డాక్టర్ పికట్ల భరత్ భూషణ్ అన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15,25లను హత్య చేసిందని, బౌద్ధం సిక్కు మతాలలోకి వెళితే.. రాజ్యాంగ హక్కులు యధావిధిగా ఉన్నప్పుడు కేవలం క్రైస్తవంలోకి వెళితే మాత్రమే రాజ్యాంగ హక్కులు చట్టాలు రిజర్వేషన్లు ఎందుకు లేకుండా పోతాయని, ఈ తీర్పుపై కేంద్రం సుప్రీం కోర్టుఫుల్ బెంచ్ కు వెళ్లి రాజ్యాంగ హక్కులు దళిత క్రైస్తవులకు వర్తింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు.
- ఆదివారం రాత్రి సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్లో కెవిపిఎస్ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవుల పట్ల సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధమేనా? అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు అధ్యక్షత వహించారు. తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ జెబి రాజు డాక్టర్ పికట్ల భరత్ భూషణ్ లు మాట్లాడుతూ.. రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి కాకుండా మత విశ్వాసాల ఆధారంగా వెలువడింది సామాజిక న్యాయం రాజ్యాంగ లక్ష్యాల మీద దాడి చేసిందన్నారు. కులం పుట్టుకతో వస్తుందని తను నచ్చిన మతాన్ని స్వీకరించటం విశ్వాసాలు నమ్మకాల ఆధారంగా వస్తుంధన్నారు మతం ఆధ్యాత్మిక విశ్వాసం. కులం సామాజిక వంశపారంపర్యంగా కొనసాగుతున్న ఒక అవిభాజ్యమైన ప్రక్రియ అన్నారు.
- క్రైస్తవంలోకి వెళ్లినవారిలో దళితులుగా మాత్రమే కులవివక్ష అంటరానితనానికి ఎందుకు గురవుతున్నారో చెప్పాలన్నారు. దళిత పాస్టర్లే ఎందుకు దౌర్జన్యాలకు దాడులకు హత్యలకు గురవుతున్నారు? క్రైస్తవం పుచ్చుకున్నంత మాత్రాన కులవివక్ష అంటరానితనం పొవట్లేదని రుజువులు ఉన్నాయన్నారు. ఒకవేళ అదే అయితే 1985లో కారంచేడులో దళితులను హత్య చేసిన సంగతి ఏమిటి? వారందరూ దళితులు క్రైస్తవులు కూడా అయినప్పటికీ మతం పేరుతో దాడి జరగలేదు కులం పేరుతోనే జరిగింది. 1991లో చుండూరులో జరిగిన హత్య వారందరూ సైతం దళితులే వారు క్రిస్టియన్ విశ్వాసాలతో ఉన్నారు. అయినా దారుణ హత్యజరిగిందన్నారు. మత విశ్వాసాల ఆధారంగా కాకుండా తాను పుట్టిన కులం ఆధారంగా వివక్షను దాడులను అత్యాచారాలను హత్యలను ఎదుర్కొంటున్న పరిస్థితి కొనసాగుతుందన్నారు.
- అగ్రకులాల్లో పుట్టి క్రైస్తవాన్ని పుచ్చుకున్న వారు తమ సామాజిక హోదాగా ఉన్నత కులం ఆధారంగానే గౌరవించబడుతున్నారని మతం మారినప్పటికీ చర్చిలు కూడా కులాల వారిగా ఉంటున్నాయని చర్చిలలో కూడా స్వకుల వివాహాలు జరుగుతున్నాయని చెప్పారు. దళితులు 15శాతం రిజర్వేషన్ పొందుతున్నవారు దళితులు క్రైస్తవం పుచ్చుకుంటే 1శాతానికి వారి రిజర్వేషన్ కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
- హిందూ మతంలో గుడిలోకి రానీయకపోయినా బడిలో చదువుకోనీయకపోయినా క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ క్రిస్టియన్ మిషనరీస్ హాస్పిటల్, చర్చిలు సంపూర్ణంగా దళితుల్ని చేరదీశాయని చెప్పారు. మతం మారినంత మాత్రాన తమ బ్రతుకులు మారడం లేదని వారు ఎదుర్కొoటున్న కులవివక్ష పోవడం లేదన్నారు. బీసీలు 27% రిజర్వేషన్ ఓసీలు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందుతున్నారు. క్రిస్టియన్ మతాన్ని స్వీకరిస్తే ఆ రిజర్వేషన్ నుండి వాళ్ళు దూరం కావట్లేదన్నారు. కానీ దళితులు మాత్రమే క్రైస్తవంలోకి వెళితే ఆ రిజర్వేషన్ వాళ్ళు కోల్పోవాల్సి రావడం ఏమిటని అన్నారు.
- ఇక్కడ గుడిలోకి రానివ్వరు అక్కడ చర్చిలోకి పోనివ్వరు దళితుల బ్రతుకులకు భరోసా ఎలా అన్నారు. బ్రదర్ అనిల్ కుమార్ బ్రదర్ సతీష్ కుమార్ లు లక్షలాది మందితో సభలు నిర్వహిస్తున్నారు. వారిపై ఏ రకమైన దాడులు దౌర్జన్యాలు జరగలేదు. కేవలం గ్రామ సీమల్లో దళిత పాస్టర్లుగా ఉన్న వారి పైన మాత్రం దాడులు దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని అంటే కులం కారణం కాదా అని అన్నారు.
- కేవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ.. బిజెపి సర్కార్ 12 ఏండ్ల పరిపాలన కాలంలోనే దళితులపై దాడులు దౌర్జన్యాలు 300 రెట్లు పెరిగాయన్నారు. కేంద్ర ప్రభుత్వ అడ్డదండలతోనే ఈ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయన్నారు. బిజెపి మతోన్మాద విధానాలపై పోరాటం చేయకుండా దళితుల హక్కులు రక్షించుకోలేమని చెప్పారు. 2018లో ఎస్సీ, ఎస్టీ లైంగిక నిరోధక చట్టాన్ని నీరుగార్చడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దేశంలో ప్రతీ పౌరుడు ఐక్యంగా ఉద్యమించిన ఫలితంగా ఆ తీర్పు వెనక్కి తీసుకోబడిందన్నారు. అదే స్ఫూర్తితో 2026 మార్చి 24న వచ్చిన తీర్పును వెనక్కి తీసుకునే అంతవరకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
- తీర్మాణాలు
- 1) మార్చి 24న వెలువడించిన సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వమే రాజ్యాంగ స్ఫూర్తితో సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ కి వెళ్ళాలి.
- 2) రాజ్యాంగ విరుద్ధంగా 1950 లో తెచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను రద్దు చేయాలి.
- 3)కేజీ బాలకృష్ణన్ కమిషన్ నివేదికను బహిర్గతపరచాలి.
- 4) దళిత క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులను దౌర్జన్యాలను అరికట్టాలి.
- 5)దళిత క్రైస్తవులు రాజ్యాంగాన్ని బైబిల్ 2చేతుల్లో పట్టుకొని రాజకీయ చైతన్యం ద్వారా చర్చిలో ప్రార్ధన రోడ్ పై శాంతియుత ప్రదర్శన నిర్వహించాలి.
- కార్యాచరణ
- 1)మే 11నుండి 20వరకు జిల్లా స్థాయి సదస్సులు రౌండ్ టేబుల్ సమావేశాలు.
- 2) మే 21నుండి 30వరకు జిల్లా మండల కేంద్రాలలో శాంతియుత నిరసన ప్రదర్శనలు.
- Advertisement -


