Thursday, July 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అడిగింది 20 వేలు..ఇచ్చింది 7 వేలు..!

అడిగింది 20 వేలు..ఇచ్చింది 7 వేలు..!

- Advertisement -

– 7 వేల పోస్టుల భర్తీకే నోటిఫికేషన్
– భగ్గుమంటున్న నిరుద్యోగ యువత
– తెలంగాణ ఎండ్రిన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాశినాధ్, వయోపరిమితి పెంచాలని డిమాండ్
నవతెలంగాణ – ఉస్మానియా యూనివర్సిటీ:
రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా మంటూ అధికార పీఠమెక్కిన కాంగ్రెస్ మోసాల పరంపర కొనసాగిస్తున్నది. ఉద్యో గాలివ్వండి నోటిఫికేషన్లు జారీచేయండి మహాప్రభో అంటూ నిరుద్యోగులు మొత్తు కుంటుంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరి స్తున్నదని రాష్ట్ర ఎండ్రీన్ పార్టీ అధ్యక్షుడు కాశినాథ్ అన్నారు.గురువారం ఓయూ లో నిరసన వ్యక్తం లో అన్నారు.కనీసం 20వేల పోలీసు ఉద్యోగా లను భర్తీచేయాలని కోరుతుంటే, నిరుద్యోగుల ఆశలకు గండికొడుతూ పోలీస్ రిక్రూ ట్మెంట్ బోర్డు బుధవారం 7,437 పోస్టు లతో నోటిఫికేషన్ విడుదల చేసిందని, ఆర్టీఐ లెక్కల ప్రకారం పోలీసాఖలో 20 వేల పైచిలుకు ఖాళీలు ఉన్నాయి. గతంలో సీఎం సైతం పోస్టులన్నీ భర్తీ చేస్తామని బహిరంగసభ వేదికగా హామీ ఇచ్చారు. ఆచరణకు వచ్చేసరికి 7,437 పోస్టులకే పరిమితం చేయడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేండ్లుగా నోటిఫికేషన్లు రాకపోవడంతో వేలాది మంది వయోపరిమితి దాటిపోయింది. నోటిఫికేషన్లో ఎలాంటి వెసులుబాటు కల్పించకపోవడంతో లక్షలాది మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

నిరుద్యోగులను పావులుగా వాడుకుని,తాము అధికారంలో వచ్చేందుకు ఎవరైతే దోహదపడ్డారో ఇప్పుడు వారినే విస్మరిం చింది. ‘గెలిచిన తెల్లారే అశోక్ నగర్ కు వస్తా మీ సమస్యలు పరిష్కరిస్తా’ అన్న సీఎం రేవంత్ రెడ్డి, రెండున్నరేండ్లు దాటినా తమను పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తుట్లు చెప్పారు. డీజీపీ స్థాయి అధికారే రాష్ట్రంలో 19 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని చెప్తున్న ప్పటికీ, ప్రభుత్వం 7,437 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -