కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిరనవతెలంగాణ-స్టేషన్‌ ఘనపూర్‌
కాంగ్రెసుతోనే అభివద్ధి సాధ్యమని స్టేషన్‌ ఘనపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సింగపురం ఇందిర అన్నారు. గురువారం మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ కీసర ముత్యంరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌ పాలనలో బడుగు బలహీన వర్గాలకు మేలు జరిగిందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ఋణం తీర్చుకోవడానికి భారీగా పార్టీలోకి చేరుతున్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టో రూపొందించారని, రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు ప్రభుత్వంలోకి రాగానే, ఇచ్చిన మాట ప్రకారం తప్పక అమలు అవుతాయన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఫీజ్‌ రీయంబర్స్‌ మెంట్‌, ఆరోగ్యశ్రీ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జగదీశ్వర్‌ రెడ్డి, మాజీ మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ ఎనకాల వెంకటేశ్వర్‌ రెడ్డి, మండల అధ్యక్షులు జూలకంటి శిరీష్‌ రెడ్డి, మాజీ మండల ఆధ్యక్షులు చెవుల యాదగిరి, మండల నాయకులు బొందయ్య, మీదికొండ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు నాగరబోయిన శ్రీరాములు కొత్తపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు రాజయ్య, గోవిందు మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

Spread the love