Wednesday, May 13, 2026
E-PAPER
Homeసినిమామంచి ఫీల్ గుడ్ సినిమా

మంచి ఫీల్ గుడ్ సినిమా

- Advertisement -

సూర్య వశిష్ట, దీప్షిక జంటగా విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఎమోషనల్ డ్రామా ‘రమణి కళ్యాణం. కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్ పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి, శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను సహజనటి జయసుధ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,'ఈ సినిమా నిర్మాతలకు అభినందనలు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌లు అద్భుతంగా నటించారు. విజయ్ చాలా ప్యాషన్‌తో ఈ సినిమాను తీశాడు. ఇది ఒక బ్యూటీఫుల్ ఫిల్మ్. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల్లో కూడా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. ‘రమణి కళ్యాణం’ కూడా అలాంటి మంచి సినిమా. మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. నేను ఈ సినిమా చూశాను. ఇది ఒక మంచి ఫీల్‌గుడ్ మూవీ. ఈ నెల 22న ఈ సినిమా విడుదల అవుతోంది అని తెలిపారు.

‘ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. మా డైరెక్టర్ ఈ సినిమాను ప్రాణం పెట్టి చేశారు. ఇందులో నేను ఛాలెంజింగ్ రోల్ చేశాను. ఇది ఒక క్లీన్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందిఅని హీరో సూర్య వశిష్ట చెప్పారు. డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ,'సినిమాలు థియేటర్స్‌లోనే చూడాలి. ఆ అనుభూతి వేరు. మాకు ఎంతో సపోర్ట్ చేసిన జయసుధకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా చూసి వారు ఇచ్చిన ప్రశంసలు మాకు ఎంతో ఎనర్జీ ఇచ్చాయి అని అన్నారు.’టీజర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా ఉంది. ఇది ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ. ఇందులో చాలా మంచి మ్యూజిక్ ఉంది. తప్పకుండా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు` అని నిర్మాత శ్రీనాథ్ పసుపులేటి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -