- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నైజీరియా సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో 100 మందికి పైగా సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ వెల్లడించింది. జంఫరా రాష్ట్రంలోని తుంఫా మార్కెట్ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని, దీనిపై తక్షణమే స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనను రెడ్ క్రాస్ ధ్రువీకరించగా, నైజీరియా మిలిటరీ మాత్రం దీనిని ఖండించింది. మృతుల్లో పౌరులు లేరని బుకాయిస్తోంది. ఈ ఘటనలో ఎక్కువగా చిన్న పిల్లలే మృతి చెందారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది.
- Advertisement -



