Wednesday, May 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకువైట్ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన‌ ఇరాన్

కువైట్ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన‌ ఇరాన్

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఐఆర్‌జీసీ(Islamic Revolutionary Guard Corps)కి చెందిన ప‌లువురు సముద్ర తీరంలోని బిబియన్ ద్వీపం గుండా త‌మ భూభాగంలోకి చొర‌బ‌డి, అల‌జ‌డుల‌కు కుట్ర‌లు చేశార‌ని, న‌లుగురిని అరెస్ట్ చేసిన‌ట్లు కువైట్ పేర్కొంది. ఈ వ్యాఖ్య‌ల‌ను ఇరాన్ ప్ర‌భుత్వం ఖండించింది. కువైట్ మాట‌లు అవాస్త‌వమ‌ని, ఆధారాలులేనివ‌ని ఇరాన్ మీడియా త‌న్సీయం పేర్కొంది. కువైట్ అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తుంద‌ని, పొరుగు దేశాల సార్వ‌భౌమాత్వాన్ని ఇరాన్ ఎల్ల‌ప్పుడు గౌర‌విస్తోంద‌ని ఇరాన్ విదేశాంగ తెలిపింది . ఇక‌పై కువైట్ అధికారులు “తొందరపాటు వ్యాఖ్యలు, నిరాధార ఆరోపణలకు” దూరంగా ఉంటార‌ని ఆశిస్తున్న‌ట్లు ఇరాన్ వెల్ల‌డించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -