Tuesday, June 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంఎల్ఏ బీర్ల ఐలయ్యకు గజమాలతో సన్మానం 

ఎంఎల్ఏ బీర్ల ఐలయ్యకు గజమాలతో సన్మానం 

- Advertisement -

 నవతెలంగాణ-ఆలేరు టౌను
నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం నార్మల్ డైరీని గట్టేక్కించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మొదటి విడతగా రూ. 10 కోట్ల నిధులు మంజూరు చేయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పాలసీతలీకరణ కేంద్రం వద్ద భారీ గజమాలతో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఆయనకు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలేర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి, డైరీ డైరెక్టర్లు శ్రీశైలం, పుప్పాల నరసింహులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎజాస్,కే సాగర్ రెడ్డి, ముదిగొండ శ్రీకాంత్, అలేటి అనిల్, మార్క్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -