- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన బాంబు పేలుడులో తొమ్మిది మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా స్వాత్ జిల్లాలోని కబాల్ పట్టణంలో వందలాది మంది శాంతి ర్యాలీ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆత్మాహుతి దాడి జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
- Advertisement -



