నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో వ్యవసాయం, ఇంధనం, మౌలిక వసతుల రంగాలకు ఊతమిచ్చేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2026-27కు కనీస మద్దతు ధర (MSP) కార్యకలాపాల కోసం భారీగా రూ.2.6 లక్షల కోట్లను కేటాయించింది. దేశీయ బొగ్గును గ్యాస్, యూరియా, ఇతర పారిశ్రామిక రసాయనాలుగా మార్చే లక్ష్యంతో రూ.37,500 కోట్ల బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రోత్సాహక పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని సర్కేజ్-ధోలేరా మధ్య సెమీ హైస్పీడ్ డబుల్ లేన్ కారిడార్ నిర్మాణానికి రూ.20,665 కోట్లను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీ మెరుగుపడటంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభించనుంది.
కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు
- Advertisement -
- Advertisement -



