Wednesday, May 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కౌలాస్ నాలా ప్రాజెక్ట్ దిగువ ఆయకట్టు రైతులు అప్రమత్తంగా ఉండాలి

కౌలాస్ నాలా ప్రాజెక్ట్ దిగువ ఆయకట్టు రైతులు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

– జుక్కల్ ఎంపీడీవో , ఎంపీవో
నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని కౌలాస్ నళా ప్రాజెక్ట్ ఆయకట్టు కింద ఉన్న రైతులు గ్రామాల ప్రజలు పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ , ఎంపీ ఓ రాము ఒక ప్రకటనలు తెలిపారు. ఈ సందర్భంగా  కౌలాస్ నాళా   ప్రాజెక్ట్ స్పిల్‌వే గేట్ల మరమ్మత్తు పనుల నిమిత్తం రేపు అనగా 14-05-2026 తేదీన మధ్యాహ్నం సుమారు 1:00 గంటల నుండి స్పిల్‌వే గేట్ల ద్వారా నీటి విడుదల జరుగుతుంది అని అన్నారు. మొదటగా సుమారు 100 క్యూసెక్స్ నీటిని విడుదల చేయబడును. అనంతరం తదుపరి 3 రోజుల పాటు సుమారు 150 క్యూసెక్స్ మరియు ఆ తరువాత అవసరమైన మేరకు రిజర్వాయర్ నీటి మట్టం తగ్గే వరకు సుమారు 200 క్యూసెక్స్ నీటిని విడుదల చేయబడునని తెలిపారు.  కావున ప్రాజెక్టు దిగువ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా కోరడమైనది. ప్రజలు క్రింది సూచనలు తప్పనిసరిగా పాటించగలరు.

1) నీటి ప్రవాహ ప్రాంతాలలో ఈత కొట్టడం, స్నానం చేయడం లేదా ఇతర కార్యకలాపాలకు వెళ్లరాదు.

2) నీటి ప్రవాహ ప్రాంతాలలో వాహనాలను దాటించరాదు.

3) పశువులను దిగువ ప్రాంతాల సమీపంలో మేపుటకు తీసుకెళ్లరాదు.

4) లోతట్టు ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలి.

గ్రామపంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు, రెవెన్యూ శాఖ మరియు పోలీస్ శాఖ అధికారులు ప్రజలకు సమాచారం అందించి అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకోవలసిందిగా కోరడమైనది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -