జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’. లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై కిషోర్ నాయుడు చిరుమమిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు.ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, థ్రిల్లింగ్ టీజర్‌తో ఆసక్తిని రేకెత్తించిన టీమ్ ఇప్పుడు ‘వదలా` టైటిల్ ట్రాక్ ని రిలీజ్ చేశారు. ప్రేమ, బాధ, భావోద్వేగాలను ఆత్మీయంగా మిళితం చేసిన ఈ పాట ఒక సోల్‌ఫుల్ మెలోడీగా ఆకట్టు కుంటోంది. ఎర్రోజు శివకృష్ణాచారి అందించిన సాహిత్యం పాటకు మరింత డెప్త్ తీసుకురాగా, ప్రియా నారాయణ తన వోకల్స్తో ప్రతి లైన్‌కి ప్రాణం పోశారు. జగపతి బాబు పై హృతికా శ్రీనివాస్ కి వున్న ఎమోషన్ ఈ పాటలో క్యాప్చర్ చేసిన తీరు ఆసక్తికరంగా వుంది. ఈ సాంగ్ ని చాలా లావిష్ గా చిత్రీకరించారు. సంగీతం, సాహిత్యం, పెర్ఫార్మెన్స్ అన్నీ కలిసి ‘వదలా’ టైటిల్ ను వినగానే గుర్తుండిపోయే మెలోడీగా నిలబెట్టాయి అని మేకర్స్ తెలిపారు.
అవసరాల శ్రీనివాస్, రవి వర్మ, జెన్నీ, రీను, కశ్యప్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి దర్శకత్వం: ఆకెళ్ల వి కృష్ణ, రచయిత: లక్ష్మీ భూపాల, నిర్మాతలు: కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ, డీఓపీ: చోటా కె నాయుడు, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: కార్తీక్ కొడకండ్ల, ఆర్ట్ డైరెక్టర్: బజ్జా బ్రమయ్య, స్టంట్స్: డ్రాగన్ ప్రకాష్, సాహిత్యం: కృష్ణవేణి మల్లవజ్జల, శివకృష్ణాచారి ఎర్రోజు, వీరు గడ్డం, ప్రొడక్షన్ కంట్రోలర్: బొడ్డు సత్యనారాయణ.
భిన్న సస్పెన్స్ థ్రిల్లర్
- Advertisement -
- Advertisement -



