Thursday, May 14, 2026
E-PAPER
Homeమానవిఇలా ప్లాన్ చేయండి

ఇలా ప్లాన్ చేయండి

- Advertisement -

పిల్లలకు వేసవి సెలవులు వచ్చేశాయి. ఉదయాన్నే లేచి స్కూల్, కాలేజీకి వెళ్లాలనే టెన్షన్ ఉండదు. పరీక్షలు ముగియడంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి ఉండదు. హాయిగా నిద్రపోతారు. అయితే నేటి డిజిటల్ యుగంలో ఎక్కువ మంది పిల్లలు సమయం దొరికితే చాలు ఫోన్లు వాడుతూ, టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. దాంతో సెలవులన్నీ వృథా అయిపోతాయి. అలాకాకుండా ఈ సమ్మర్​ హాలిడేస్ ఇలా ప్లాన్ చేయండి. మంచి నైపుణ్యాలు నేర్చుకోవడమే కాకుండా శారీరకంగా, మానసికంగా ఫుల్ స్ట్రాంగ్ అవుతారు. మరి, పిల్లలు తమ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలంటే వేసవి సెలవులను ఎలా సద్వినియోగం చేసుకోవాలో చూద్దాం.

ఏయే సబ్జెక్టుల్లో మెరుగ్గా ఉన్నాం, వేటిలో వీక్ ఉన్నామనే విషయంలో ప్రతి ఒక్కరికీ ఒక అవగాహన ఉంటుంది. బలహీనంగా ఉన్నవాటిల్లో మెరుగవ్వడానికి వేసవి సెలవుల్లో టైమ్ కేటాయించాలి. అందుకోసం ట్యూషన్​కు వెళ్లడం, ఆన్​లైన్ క్లాసెస్, స్నేహితుల ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న సబ్జెక్టుల్లో మంచి పట్టు సాధించే ప్రయత్నం చేయాలి. అలాగే స్పోకెన్‌ ఇంగ్లిష్, కంప్యూటర్‌ కోర్సులు, విదేశీ భాషలు.. వీటిల్లో మీకు నచ్చిన వాటిని నేర్చుకుంటే ఫ్యూచర్​లో తప్పకుండా యూజ్ అవుతాయంటున్నారు. ముందస్తు ఏర్పాట్లు: కొంతమంది విద్యార్థులు పైతరగతికి అవసరమయ్యే బుక్స్​ను చివరి నిమిషంలో కొనుగోలు చేస్తుంటారు. అప్పటికి మార్కెట్లో పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేకపోవచ్చు. అదే, ముందుగానే సిద్ధం చేసుకుంటే చివరి నిమిషంలో ఇబ్బందులు ఉండవు. అలాగే, స్టడీ రూమ్ లేదా చదువుకునే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవచ్చు.

సీనియర్స్ సలహాలు : కొత్త విద్యా సంవత్సరంలో సబ్జెక్ట్స్ విషయంలో చాలా సందేహాలు ఉండొచ్చు. అదే వేసవి సెలవుల్లో సీనియర్స్​తో మాట్లాడితే ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా టైమ్​ మేనేజ్​మెంట్, స్టడీ టెక్నిక్​ల విషయంలో వాళ్లు ఇచ్చే సలహాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఫలితంగా ఒత్తిడిని అధిగమించి, అవగాహన పెంచుకుని ఆత్మవిశ్వాసంతో కొత్త తరగతిలోకి అడ్మిషన్​ పొందుతారు. పుస్తకాలు చదవడం : వేసవి సెలవుల్లో పుస్తకాలు చదవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు నచ్చిన లేదా ప్రముఖులు మెచ్చిన బుక్స్, వారి జీవిత చరిత్రలు, వైజ్ఞానిక పుస్తకాలు చదవడం వల్ల ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. ఎక్కువగా చదవడం వల్ల చక్కగా రాసే నైపుణ్యం అలవడుతుంది. ఇతరులకు మీ ఆలోచనలు, అభిప్రాయాలను డెరైక్ట్​గా, ప్రభావవంతంగా చెప్పగలుగుతారు. ఫ్యూచర్​లో వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లోనూ మంచి ప్రతిభ కనబరుస్తారు.

సంపాదించడం మొదలుపెట్టండి : ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్​తో పాటు డబ్బు అవసరం. అందుకే ఈ వేసవి సెలవుల్లో సొంత సంపాదనా మార్గాల గురించి ఆలోచించొచ్చు. ట్యూషన్లు చెప్పడం, డ్రైవింగ్, ఆహార పదార్థాలు, సరకులు డెలివరీ చేయడం వంటివి చేయొచ్చు. అంతేకానీ, ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచన చేయాల్సిన పని లేదు. నిరభ్యంతరంగా మీకు నచ్చిన మార్గాన్ని ఎంచుకుని సంపాదించడం కూడా మొదలుపెట్టొచ్చు.కొత్త అభిరుచులు : కొత్త విషయాలు నేర్చుకోవాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ సమయం లేక వాటిని వాయిదా వేస్తుంటారు. ఇప్పుడు సెలవుల్లో మీకు ఇష్టమైన పనులెన్నో చేయొచ్చు. పెయింటింగ్ నుంచి నృత్యం వరకు తగినంత టైమ్ కేటాయించొచ్చు. అందుకోసం వర్క్‌షాప్‌లూ, ఆన్‌లైన్‌ క్లాసుల్లో చేరి నేర్చుకోవడం స్టార్ట్ చేయొచ్చంటున్నారు. క్రీడలు, వ్యాయామం : మీ ఆసక్తిని బట్టి ఈ సమ్మర్​ హాలిడేస్​లో ఆటలనూ ప్రాక్టీస్ చేయొచ్చు. హాలిడేస్ తర్వాత కూడా వాటిని కంటిన్యూ చేసి వివిధ పోటీల్లోనూ పాల్గొన్నవచ్చు. స్పోర్ట్స్, వ్యాయామం కారణంగా మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫలితంగా చదువుపై ఏకాగ్రత పెరిగి చదువులోనూ ఉన్నతంగా రాణించగలుగుతారు. అలాగే, సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సమాజ సేవతో పాటు మంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -