పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వాటిని సరిగా నిల్వ చేయకపోతే త్వరగా పాడైపోతాయి. అందుకే ఏ పండు, కూరగాయ ఎంతకాలం తాజాగా ఉంటుంది, ఎలా నిల్వ చేయాలనే విషయం తెలుసుకోవడం అవసరం. ఆపిల్: బయట వారం రోజులు, ఫ్రిజ్‌లో మూడు నుంచి నాలుగు వారాల వరకు తాజాగా ఉంటుంది. కొద్దిగా దెబ్బతిన్నా తినవచ్చు. బూజు పట్టినది మాత్రం తినకూడదు. అరటిపండు: రెండు నుంచి ఏడు రోజుల వరకు తాజాగా ఉంటుంది. బూజు లేకపోతే మెత్తబడిన అరటిపండును తినవచ్చు. నారింజ, బత్తాయి: బయట వారం రోజులు, ఫ్రిజ్‌లో నెల రోజుల వరకు తాజాగా ఉంటాయి. చెట్టు నుంచి కోసిన ఐదు రోజుల్లోపు తినేస్తే మంచిది. టమాట: ముందుగా బయట పండనివ్వాలి. తర్వాత ఫ్రిజ్‌లో రెండు వారాల వరకు నిల్వ ఉంటుంది. బూజు లేకపోతే కొద్దిగా మెత్తబడిన టమాటను తినవచ్చు. క్యారెట్ : బయట రెండు వారాలు, ఫ్రిజ్‌లో నెల రోజులకు పైగా నిల్వ ఉంటాయి. మెత్తబడినా, బూజు పట్టినా పారేయాలి.
దోసకాయ: ఫ్రిజ్‌లో వారం రోజుల వరకు తాజాగా ఉంటుంది. కోసిన దోసకాయను ఒకటి లేదా రెండు రోజుల్లో తినేయాలి. పుట్టగొడుగులు: బయట ఒక రోజు మాత్రమే తాజాగా ఉంటాయి. ఫ్రిజ్‌లో మూడు నుంచి ఏడు రోజుల వరకు నిల్వ ఉంటాయి. నల్లగా మారితే వాడకుండా ఉండటం మంచిది. పండ్లను, కూరగాయలను కలిపి నిల్వ చేయడంలోనూ జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఆపిల్, అరటిపండు పండే సమయంలో ఒక ప్రత్యేక వాయువును విడుదల చేస్తాయి. దాని ప్రభావంతో పక్కన ఉన్న ఇతర పండ్లు, కూరగాయలు త్వరగా మగ్గిపోయి పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని వేరుగా ఉంచడం మంచిది.
తాజాగా ఉన్నాయా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



