Wednesday, September 9, 2026
E-PAPER
Homeమానవిఇలా చేద్దాం..?

ఇలా చేద్దాం..?

- Advertisement -

గిన్నెలు తోమడం పూర్తయ్యాక.. పదార్థపు అవశేషాలు స్క్రబ్బర్‌పై లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. బాగా ఆరనివ్వాలి. బ్రష్‌, స్పాంజిలు, స్క్రబ్బర్లను వైట్ వినెగర్‌లో లేదంటే బేకింగ్‌ సోడా కలిపిన నీటిలో పది నిమిషాల పాటు నానబెట్టాలి. ఆపై సాధారణ నీటితో కడిగేస్తే సరిపోతుంది. చాలామంది గిన్నెలు తోమే స్క్రబ్బర్లు, స్పాంజిలను సోప్‌బాక్సులో వేసి రోజంతా అలాగే ఉంచేస్తారు. ఇలా తడిగా ఉన్న వాటి పైకి బ్యాక్టీరియా, క్రిములు త్వరగా చేరతాయి. అవి గిన్నెలు తోమినప్పుడు వాటి ద్వారా మన శరీరంలోకి చేరి వివిధ వ్యాధులకు కారణమవుతాయి. కాబట్టి వీటిని ఎప్పుడూ పొడిగా ఉండే ప్రదేశాల్లోనే ఉంచాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పని పూర్తయ్యాక కిచెన్‌ బాల్కనీలో పెట్టడం మంచిది. కిచెన్‌ క్లీనింగ్‌ కోసం సిలికాన్‌తో తయారుచేసిన స్క్రబ్బర్లు, బ్రష్‌లు వాడడం మరీ మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇవి చేతికి అనువుగా ఉండడంతో పాటు త్వరగా ఆరిపోతాయి కూడా! తద్వారా బ్యాక్టీరియా, క్రిములు వీటిపైకి చేరే అవకాశం ఉండదని చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -