ప్రతి ఒక్కరికి చర్మ సంరక్షణ అనేది చాలా అవసరం. మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు బటయ తిరగడం వల్ల గాల్లో ఉన్న దూళికణాలు మన చర్మంపైకి చేరుతాయి, ముఖంపై దుమ్మూ ధూళీ చేరి మచ్చలు, మొటిమలు వస్తాయి. అందుకే కనీసం రెండుసార్లు ముల్తానీ మట్టి వంటి వాటితో ఫేస్ మాస్క్ వేసుకోవడం కూడా చర్మ ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. దానిని రోజ్ వాటర్, కలబంద జెల్‌తో కలిపి.. ఈ మిశ్రమా న్ని ముఖంపై అప్లై చేసి 10 నిమిషాలు ఉంచి, కడిగేస్తే చాలూ.. మీ ముఖంపై ఉన్న జిడ్డు మొత్తం పోయి.. మీ ఫేస్ సహజంగా మెరుస్తుంది.నీరు చర్మ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి జిడ్డు చర్మం ఉన్నవారు ఎక్కువ నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం వల్ల చర్మంలో అయిల్ సమస్య తగ్గుతుంది. అలాగే డీప్‌ప్రైడ్ ఆహారాలు తినడం కూడా మానుకోండి. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ తినడం వల్ల చర్మ సమస్యలు పెరుగుతాయి. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మానసిక ఒత్తిడి కూడా చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎంత ఖరీదైన మేకప్ వేసుకున్నా, లోపల ఒత్తిడి ఉంటే, ముఖం అలసిపోయినట్లు కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒత్తిని అధిగమించేందుకు ధ్యానం చేయడం, విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మార్నింగ్ లేచిన వెంటనే కాసేపు ఎండలో నిల్చోండి. ఇలా చేయడం ద్వారా సూర్య కిరణాలు మీ ముఖంపై పడి చర్మంపై ఉన్న బ్యాక్టీరియాను తొలగిస్తాయి. దీని వల్ల చర్మం తాజాగా ఉంటుంది. కొన్ని రోజులు ఈ చిట్కాలను పాటిస్తే, మీ ముఖంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది.
స్కిన్ కేర్ ఇలా…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



