నవతెలంగాణ-జక్రాన్‌పల్లి: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన 295/5 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయానికి బ్రాహ్మణపల్లి గ్రామస్తులందరూ తరలివచ్చి తమకు న్యాయం చేయాలంటూ తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదు ను కూడా తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. తొరికొండ గ్రామానికి చెందిన దుబ్బాల చిన్న దేవన్న బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమి 295/5 సర్వేనెంబర్ కబ్జా చేసి పంట వేసుకున్నారని, ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ బ్రాహ్మణపల్లి ప్రభుత్వ భూమిని బ్రాహ్మణపల్లి లోని నిరుపేదల గాని బ్రాహ్మణపల్లి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఆ భూమిని పట్టా చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాసిల్దార్ మాట్లాడుతూ వచ్చే మంగళవారం నాడు నిజాంబాద్ నుంచి సర్వే అధికారులను పిలిపించి సర్వే చేయిస్తామని తెలిపారని గ్రామస్తులున్నారు. మంగళవారం బ్రాహ్మణపల్లి గ్రామానికి సర్వేకు వచ్చి సర్వే చేస్తే బ్రాహ్మణపల్లి భూమి కాదని తేలితే వదిలేస్తామని అన్నారు. మంగళవారం సర్వేకు రాకుండా కాలయాపన చేస్తే కలెక్టరేట్ ముందట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివప్రసాద్, ఉప సర్పంచ్ భూమిక శేఖర్, మాజీ సర్పంచ్ దేవరాజు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



