Thursday, July 16, 2026
E-PAPER
Homeజాతీయంబాలికల పట్ల రాజస్థాన్ లో అమానుషం..

బాలికల పట్ల రాజస్థాన్ లో అమానుషం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: రాజస్థాన్ లో స్కూల్ విద్యార్థుల పట్ల ఓ టీచర్ అమానుషంగా వ్యవహరించింది. రూ.500 దొంగలించారనే నెపంతో విద్యార్థుల బట్టలు విప్పించి సోదాలు నిర్వహించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బామన్వాస్‌లోని లివాలి గ్రామంలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో సరస్వతి మీనా అనే హిందీ టీచర్.. తరగతి గదిలోని తన వస్తువుల్లో రూ. 500 కనిపించకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పలు చోట్ల వెతికినా ఆ డబ్బు లభించకపోవడంతో, విద్యార్థులే దానిని దొంగిలించారని ఉపాధ్యాయురాలు అనుమానించింది.

సదురు టీచర్ తన సహచరుడితో కలిసి 9, 11 తరగతుల బాలికలను ఒక గదిలో బంధించారు. డబ్బును తిరిగి రాబట్టేందుకు “విచారణ” అనే నెపంతో, విద్యార్థినులను సోదా చేసి, వారి బట్టలు విప్పమని బలవంతం చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలియగానే పలువురు తల్లిదండ్రులు పాఠశాల ప్రాంగణానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తక్షణమే సరస్వతి మీనాను సస్పెండ్ చేస్తూ సభరత్‌పూర్ డివిజన్, పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్ కార్యాలయం ఉత్తర్వులను జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -