నవతెలంగాణ-హైదరాబాద్: మయన్మార్ దారుణం జరిగింది. బంగాళాఖాతంలో రోహింగ్యాలు ప్రయాణిస్తోన్న రెండు పడవలు మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయని సమాచారం. జూన్ చివర్లో మయన్మార్‌లోని రాఖైన్ రాష్ట్రతీరం నుంచి రెండు పడవలు బయల్దేరాయి. బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాల్లోని కొందరు కూడా ఆ పడవలు ఎక్కారు. ఒక బోట్‌లో 250 మంది ఉండగా.. ప్రయాణం ప్రారంభించిన కొద్దిసేపటికే అది కాంటాక్ట్ కోల్పోయింది. మరో పడవలో 280 మంది ఎక్కారు. అది జులై 8న అయేయార్వాడీ తీరంలో ఇది మునిగిపోయింది. అంతకంటే కొన్ని రోజుల ముందే మొదటి పడవ కూడా ముగినిపోయినట్లు వార్తలు వచ్చాయి.దీంతో ఈ ప్రమాదాలపై అంతర్జాతీయ వలసల సంస్థ, యునైటెడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రాథమిక దర్యాప్తు నివేదికల ప్రకారం.. రెండు పడవల్లోని ప్రయాణికులంతా మరణించి ఉంటారని ఈ సంస్థలు అంచనా వేశాయి.
బంగాళాఖాతంలో పడవ బోల్తా..500 మంది గల్లంతు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


