Thursday, July 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలునీళ్ల కోసం రోడ్డెక్కిన గురుకుల విద్యార్థినులు

నీళ్ల కోసం రోడ్డెక్కిన గురుకుల విద్యార్థినులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్‌లోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు నీటి సమస్యను నిరసిస్తూ రోడ్డెక్కి ధర్నా చేశారు. గత నెల రోజులుగా తాగునీటితో పాటు కనీసం వాష్‌రూమ్‌లకు కూడా నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించడానికి ప్రధానోపాధ్యాయుడు ఒక్కొక్కరి నుంచి రూ.10 వసూలు చేయాలని చెప్పారని, లేదంటే విద్యార్థులను వేధిస్తున్నారని ఆరోపించారు. వెంటనే నీటి వసతి కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -