Saturday, May 16, 2026
E-PAPER
Homeకరీంనగర్బాల్య వివాహాలతో జరిగే ఇబ్బందులపై అవగాహన కల్పించాలి

బాల్య వివాహాలతో జరిగే ఇబ్బందులపై అవగాహన కల్పించాలి

- Advertisement -
  • బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి

నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల: బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యతని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. స్త్రీ, మహిళా, శిశు, వృద్ధుల, దివ్యాంగుల, ట్రాన్స్ జెండర్స్ ల సంక్షేమ శాఖ ఆద్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో బాలల హక్కుల పరిరక్షణపై రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సర్పంచులు, మున్సిపల్ వార్డ్ సభ్యులు, అంగన్వాడీ టీచర్లకు అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు వచన్ కుమార్ రెడ్డి, బండి అపర్ణ, మర్రిపల్లి చందన, గోగుల సరిత, వందన గౌడ్, ప్రేమలత అగ్రవాల్ హాజరయ్యారు.

ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లల రక్షణ.. సమాజం బాధ్యత టోల్ ఫ్రీ నంబర్లతో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కిశోర బాలికలకు శిక్షణ ఇచ్చేందుకు కుట్టు మిషన్ అందజేశారు.
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డుల్లో బాలల హక్కుల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని, బాల్య వివాహాలతో కలిగే ఇబ్బందులపై అవగాహన కల్పించాలని, బాల్య వివాహాలు అడ్డుకోవాలని సూచించారు. పాఠశాలల్లో డ్రాప్ ఔట్లు ఉండవద్దని, ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో సౌకర్యాలపై వివరించి.. ప్రవేశం కల్పించాలని ఆదేశించారు.
బాల కార్మిక వ్యవస్థ ఉండవద్దని స్పష్టం చేశారు.

గ్రామ పంచాయతీ అభివృద్ధితోపాటు ప్రతి నెలా సమావేశం ఏర్పాటు చేసి.. బాలల స్థితిగతులు, ఇబ్బందులు గుర్తించాలని సూచించారు. 1098 హెల్ప్ లైన్ వినియోగించుకోవాలని తెలిపారు.అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. పిల్లలకు వ్యాక్సిన్లు ఇప్పించాలని సూచించారు. బాలలే దేశ భవిష్యత్ అని, అందరి సహకారంతోనే ప్రతి సామాజిక రుగ్మతలోని నిర్మూలించవచ్చని పేర్కొన్నారు. మగ, ఆడపిల్లల ఇద్దరం సమానమని స్పష్టం చేశారు. ప్రతి వివాహం నమోదు కావాలని సూచించారు.

అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలపై వివరించాలని తెలిపారు. ఆరు ఏండ్లలోపు పిల్లలు చేర్పించాలని ఆదేశించారు. స్థానిక సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. బాల బాలికలకు అవగాహన కల్పించాలని, చదువుతోనే సామాజిక. ఆర్థిక మార్పు సాధ్యమని తెలిపారు.

ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..18 ఏండ్ల లోపు బాల, బాలికలను కమిటీలు సంరక్షించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించాలని తెలిపారు. జిల్లాలో 100కు పైగా అంగన్వాడీ ల భవనాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు.
బాలలపై వేధింపులు, బాల్య వివాహాలు నిరోధించాలని ఆదేశించారు. సర్పంచులు అంగన్వాడి కేంద్రాలు, స్కూల్స్ లో సందర్శించాలని సూచించారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమంతోపాటు చిన్నారులు హక్కుల రక్షణకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బాల్య వివాహాలు నిరోధానికి ప్రభుత్వ అనేక పథకాలు అమలు చేస్తుందని వివరించారు.
తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు రానున్నాయని, గ్రామాల్లో పిల్లల స్కూల్స్ నుంచి డ్రాప్ ఔట్ కావద్దని తెలిపారు.

విద్యపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, డైట్ చార్జీలు 40 శాతం, కాస్మొటిక్ ఛార్జీలు పెంచిందని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ప్రతి గ్రామంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సర్పంచులు, కార్యదర్శులు బాలల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -