- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మే 22న ఉప్పల్ వేదికగా జరగనున్న ఎస్‌ఆర్‌హెచ్, ఆర్సీబీ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నట్లు సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ‘‘సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి అనేక ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన ‘డిస్ట్రిక్ట్’ యాప్‌ను పోలిన రంగులు, లోగోలతో ఉన్న నకిలీ యాప్‌లను సృష్టించి, తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ ఊరిస్తున్నారు. ఫేక్ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త’’ అని పేర్కొన్నారు.
- Advertisement -



