Saturday, May 16, 2026
E-PAPER
Homeజాతీయంతమిళనాడు మంత్రివర్గంలో శాఖల కేటాయింపు

తమిళనాడు మంత్రివర్గంలో శాఖల కేటాయింపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తమిళనాడులో నూతన మంత్రివర్గంలోని మంత్రుల శాఖలను సీఎం విజయ్ శనివారం అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర పాలనలో తనదైన ముద్ర వేసేలా పలువురు నేతలకు కీలక బాధ్యతలను అప్పగించారు. ముఖ్యమంత్రి విజయ్ అత్యంత కీలకమైన హోం శాఖతో పాటు ప్రత్యేక కార్యక్రమాల అమలు వంటి కీలక శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న ఎన్. ఆనంద్‌కు గ్రామీణాభివృద్ధి, జలవనరుల వంటి ముఖ్యమైన శాఖలను కేటాయించారు. కె.ఎ. సెంగోట్టయ్యన్ కు ఆర్థిక శాఖ, ఆదవ్ అర్జునకి ప్రజా పనుల శాఖ (భవనాలు, రహదారులు, చిన్న ఓడరేవులు), క్రీడాభివృద్ధి శాఖలు, కె.జి. అరుణ్ రాజ్ కి ఆరోగ్య, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖలు, ఎస్. కీర్తనకి పరిశ్రమల శాఖను కేటాయించారు. ఈ నూతన మంత్రివర్గం రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని సిఎం విజయ్ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -