Saturday, May 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరైలు ప్ర‌మాదం..8మంది మృతి

రైలు ప్ర‌మాదం..8మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: థాయిలాండ్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొనడం వలన చెలరేగిన మంటలు బస్సును, సమీపంలోని వాహనాలను చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో 8మంది మరణించగా, మరో 25 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. రైలు ఢీకొనడంతో మంటలు చెలరేగాయని, అవి బస్సును, సమీపంలోని వాహనాలకు వ్యాపించ‌య‌న్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందిని, సహాయక బృందాలను ఘటనా స్థలానికి పంపినట్లు ప్రకటించారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి వ‌చ్చాయ‌ని, బాధితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామ‌ని తెలిపారు. ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -