Thursday, July 16, 2026
E-PAPER
Homeజాతీయంఒత్తిడిలో ఉన్నవారు 21లోపు టీఎంసీని వీడండి

ఒత్తిడిలో ఉన్నవారు 21లోపు టీఎంసీని వీడండి

- Advertisement -
  • టీఎంసీ అధినేత మమతా బెనర్జీ

నవతెలంగాణ-హైదరాబాద్: టీఎంసీకి రాజ్యసభ ఎంపీ రుక్మిణి మాలిక్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె రాజీనామాపై టీఎంసీ అధినేత మమతా బెనర్జీ స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవాలని అనుకునే వాళ్లు ఈనెల 21 లోపు వీడ్కొలు పలకాలని ఎక్స్ వేదికగా వీడియో సందేశం విడుదల చేశారు. ఆ రోజు బెంగాల్ లో షాహిద్ దివాస్ ర్యాలీ నిర్వహిస్తామని, ఈలోపు బీజేపీతో స్వచ్చందంగా వెళ్లిపోవచ్చు అని తెలియజేశారు.

“నేను ఒక ఎంపీని చూశాను, ఆమె పట్ల నాకు గౌరవం ఉంది. ఆమె ఈ విషయాన్ని ముందే ఈమెయిల్ ద్వారా తెలియజేశారు. ఈ రోజు ఆమె ఒక బీజేపీ నాయకుడిని కలిశారు. ఒత్తిడిలో ఉన్నవారు జూలై 21న వచ్చే ‘షహీద్ దివస్’ (అమరవీరుల దినోత్సవం) లోపు మీకు నచ్చిన నిర్ణయం తీసుకుని, ఎక్కడికైనా వెళ్ళవచ్చు. మనకు నచ్చిన పనిని చేసే హక్కును మన రాజ్యాంగం మనకు కల్పిస్తోంది. మాకు దూరమవుతున్న వారు కూడా వాళ్లతో సంప్రదింపుల్లోనే ఉన్నారు.ఢిల్లీలో ప్రకంపనలు వస్తే, బెంగాల్‌పై కూడా ప్రభావం పడుతుంది” అని ఆమె హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -