ప్రేమ, జ్ఞాపకాలు, జీవిత పోరాటం వంటి భావోద్వేగాలతో హృద యాన్ని హత్తుకునే కథగా తెరకెక్కు తున్న చిత్రం ‘సహ (లైఫ్ ఆఫ్ సంజు)’. నిశాంత్ దోటి దర్శ కత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శివ కుమార్ కాసారం హీరోగా నటిస్తుండగా, శ్వేత లక్ష్మణ్, వ్రజనా పాండ్యా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజేశ్వర్ వెల్పుచర్ల నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ తొలి పాట ‘కాలాన్నే తిరగేసి’ను విడుదల చేసింది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ,’ నిర్మాత తేజ్ నా స్నేహితుడు. శేఖర్ చంద్ర అద్భుతమైన సంగీతం అందించారు. పూర్ణాచారి సాహి త్యం చాలా బాగుంది. అనురాగ్ కులకర్ణి వాయిస్ ఈ పాటకు మరో పెద్ద ప్లస్ అయింది. శ్వేత చాలా చక్కగా నటించింది. తన పాత్ర చాలా సవాళ్లతో కూడుకున్నది. ఆమె పెర్ఫార్మెన్స్ అందరికీ గుర్తుండి పోతుంది. నిశాంత్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంది. ప్రతి ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆద్యంతం భావోద్వేగభరితంగా ఉంటుంది` అని అన్నారు.
ఆద్యంతం భావోద్వేగభరితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



