Thursday, July 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహృదయాలను హత్తుకునే కథ

హృదయాలను హత్తుకునే కథ

- Advertisement -

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతున్న చిత్రం ‘హుషారు పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మిస్తున్నారు.
భిక్షు దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ఏషియన్‌ సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు ఆగస్టు 15న థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘టోంగా టోంగాఅనే గీతాన్ని విడుదల చేశారు. చరణ్‌ అర్జున్‌ సంగీత దర్శకత్వంలో ఎస్‌.ఎస్‌.చిరంజన్‌ సాహిత్యంతో, మెయిన్‌ కొరియోగ్రఫీతో ఈ పాట తెరకెక్కింది. ఈ సందర్భంగా బెక్కెం వేణుగోపాల్‌ మాట్లా డుతూ, 'ఈ సినిమా చూసి నేను ఎంతో ఇంప్రెస్‌ అయ్యాను. ఈ సినిమా చూసిన అందరూ పాజిటివ్‌గా స్పందించారు. సినిమా తప్పకుండా హిట్‌ అవుతుందనే కాన్ఫిడెన్స్‌ ఉంది. ఈ చిత్ర దర్శకుడు భిక్షు త్వరలో తెలుగు సినిమాలో కొంత ట్రెండ్‌ సృష్టించ బోతున్నాడు అని అన్నారు. ‘టీజర్‌ విడుదలైనప్పుడు వైరల్‌ అయ్యింది. అయితే చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. కానీ సినిమా విడుదల తరువాత ఈ కథలో ఉన్న అసలు విషయం అందరికి తెలుస్తుంది. అందరి హృద యాలకు హత్తుకునే సినిమా ఇది. ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్‌ ఉన్నాయి. ఈ కథ చెప్పినప్పుడు చిట్టి పిల్ల, మాసినెపల్లి రవి పాత్రలు అందరిని అలరిస్తాయి. నిర్మాత సురేష్‌బాబు ఈ సినిమాను విడుదల చేయడం అంటేనే ఈ సినిమా ఎలాంటి సినిమానో అర్థం చేసుకొవచ్చు` అని నిర్మాత వెంకట్‌ యాదవ్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -