తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్రతో ముందుకు సాగుతున్న దర్శకుడు, నిర్మాత ఎస్కే బషీద్ నుండి మరో విభిన్నమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్‌బీకే ఫిలిం కార్పొరేషన్ బ్యాన ర్‌పై, రేగుల నీరజరాణి సమర్పణలో, ఆర్ఎన్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో రూపొందిన హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘అమెన్’ ఈ నెల 24న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “హెచ్చరిక: మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా ఇంట్లో ఉంచి సినిమాకు రండి…” అనే క్యాప్షన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ప్రేమికులను ఆద్యంతం ఉత్కంఠకు గురి చేసే సినిమా ఇది. ఈ సినిమా గురించి ఎస్కే బషీద్ మాట్లాడుతూ,’ఇప్పటివరకు వచ్చిన హర్రర్ సినిమాల ట్రెండ్‌ను పూర్తిగా మార్చేలా ఈ సినిమాని రూపొం దించాం. సరికొత్త సస్పెన్స్, భయానక ఎలిమెంట్స్‌తో ప్రేక్ష కులను థ్రిల్ చేయబోతున్నాం. కొత్త నటీనటులతో టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌తో సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఎంత భయపెడుతుందో చెప్పలేం… గుండె జబ్బులు ఉన్న వాళ్లు థియేటర్‌కు రావద్దు. ఒం టరిగా కూర్చుని చూసే ధైర్యం ఎవరికీ ఉండదు. ఇది కుటుంబ సమేతంగా థియేటర్లలో ఆస్వాదిం చాల్సిన ఒక భయానక అనుభవం. ఔట్‌పుట్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఈ చిత్రాన్ని మేమే స్వయంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం` అని అన్నారు.
భయపెట్టే ‘అమెన్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



