- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లో టమాటా ధరలు గణనీయంగా పెరిగాయి. గత నెలలో కిలో రూ.15-20 ఉన్న టమాటా ప్రస్తుతం రూ.40-60కి చేరుకుంది. గత నెలలో ధరలు పడిపోవడంతో రైతులు సాగు, పంట కోతలు నిలిపివేయడమే దీనికి కారణమని చెబుతున్నారు. పెరిగిన ధరలతో రైతులు సంతోషంగా ఉన్నప్పటికీ, డిమాండ్‌కు తగ్గట్లుగా పంట లభించడం లేదని పేర్కొన్నారు.
- Advertisement -



