- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రాజస్థాన్‌లో పేపర్ లీక్ కావడంతో ఈనెల 3న నిర్వహించిన నీట్-యూజీ పరీక్ష రద్దైన విషయం తెలిసిందే. అనేక విమర్శలు రావడంతో పేపర్ లీక్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు అప్పగించారు.ఈ వ్యవహారంలో కీలక పాత్ర షోషించిన మనీషా మంధారేను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. తాజాగా ఆదివారం ఢిల్లీ రౌజ్ అవిన్యూ కోర్టులో నిందితుని ప్రవేశపెట్టారు. కేసులో మరిన్ని కీలక విషయాలు తెలుసుకోవడానికి నిందితుని కస్టడీకి అనుమతించాలని కోర్టును కోరారు. రెండు వారాలకు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.
- Advertisement -



