నవతెలంగాణ-హైదరాబాద్: పీఎం ఇంటి ఎదుట ధర్నా చేపట్టిన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన చుట్టు ఉన్న కాంగ్రెస్ ఎంపీల వలయాన్ని ఛేదించి రాహుల్ గాంధీని బలవంతంగా వ్యాన్ లోకి ఎక్కించారు. ఈక్రమంలో ప్రతిపక్షనేత ముక్కుకు గాయాలు అయినట్లు సమాచారం. పోలీస్ చర్యను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన నిర్భందాన్ని నిరసిస్తూ పీఎం ఇంటి ఎదుట కాంగ్రెస్ నాయకులు ఆందోళన కొనసాగించారు.
సోమవారం జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌కు నిరసనగా.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కెసీ వేణుగోపాల్ నేతృత్వంలో ప్రధాని మోడీ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించాయి. ప్రధాని నివాసానికి పాదయాత్రగా వెళ్లిన ఖర్గే, రాహుల్, ప్రియాంక, ఆ పార్టీ నేతలు అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.





