నవతెలంగాణ – మద్నూర్
ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఉప కార్యనిర్వహణ ఇంజనీర్ కార్యాలయం మద్నూర్ లో ఉంది. కార్యాలయం ఇక్కడ విధులు నిర్వహించేది బిచ్కుందలో.. గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కోసం డి ఈ ధర్మేందర్ మద్నూర్ కార్యాలయానికి వచ్చి సోమవారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయనను కలిసిన విలేకరులు డి ఈ గారిని ప్రశ్నించడం జరిగింది. కార్యాలయం ఇక్కడ ఉంది.. మీరు బిచ్కుందలో విధులు నిర్వహించడం ఏమిటని అడగగా.. మద్నూర్లో కార్యాలయం భవనం చిన్నగా ఉంది.. ఇక్కడ ఐదుగురు ఏఈలు ఒక డి ఈ కూర్చోవడానికి స్థలం లేదనే సమాధానం ఇచ్చారు. స్థలం లేదు సరే సార్ మరి జెండా ఎందుకు ఇక్కడ ఎగరవేస్తున్నారు అని ప్రశ్నించగా.. సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. ఈ విషయంలో సంబంధిత శాఖ జిల్లా అధికారులు ఇక్కడ కార్యాలయం అక్కడ విధులు కొనసాగించే దానిపై స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉందని మద్నూర్ మండల ప్రజలు కోరుతున్నారు.
కార్యాలయం ఇక్కడ.. విధులు అక్కడ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



