సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘ టనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్ష కులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది. ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం హైదరా బాద్‌లోని మూసాపేట శ్రీరాములు థియేటర్‌లో వారాహి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. హీరో సుమంత్ మాట్లాడుతూ,’ వారాహి గుప్త నవరాత్రుల సం దర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ థియేటర్‌లో తమ్ముడు అఖిల్ ‘లెనిన్` సినిమా విజయవం తంగా ప్రదర్శిస్తమౌతుంది. వారాహి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఒక గొప్ప అనుభూతి.
దీనికి సహకరించిన మా నిర్మాతలకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అమ్మవారి ఆశీస్సులతో త్వరలోనే మా సినిమా మీ ముందుకు రాబోతోంది. మరో రెండు రోజుల్లో సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం` అని తెలిపారు.’రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100 థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించ బోతున్నాం. అక్కడ నిరంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రేక్షకుల ఆశీర్వా దాలతో సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను` అని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి చెప్పారు. ‘వారాహి అమ్మవారి మహిమను మంచి కథ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే సంక ల్పంతో నిర్మాతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మనందరికీ ఇష్టమైన హీరో సుమంత్. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుం దని నమ్ముతున్నాను. ఇందులో నేను కూడా ఒక మంచి పాత్ర పోషిం చాను. ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తు న్నాను` అని నరేష్ అన్నారు.
ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



