Tuesday, May 19, 2026
E-PAPER
Homeక్రైమ్బీబీనగర్‌లో సైకో వీరంగం..ఎయిమ్స్ అధికారిపై కత్తితో దాడి

బీబీనగర్‌లో సైకో వీరంగం..ఎయిమ్స్ అధికారిపై కత్తితో దాడి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఓ సైకో వీరంగం సృష్టించాడు. పట్టణంలోని పోచంపల్లి రోడ్డు చౌరస్తా వద్ద.. అటువైపుగా వెళ్తున్న ఎయిమ్స్ నర్సింగ్ అధికారిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఘటనతో అప్రమత్తమైన స్థానికులు దుండగుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.

అనంతరం దుండగుడిని బీబీనగర్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం భయానకంగా మారింది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -