- Advertisement -
- ఆయన వ్యాఖ్యలపై ఏమి వివరణ ఇస్తారోనని కామారెడ్డి జిల్లాలో ఉత్కంఠ
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి ఎమ్మెల్యే కటిపల్లి వెంకటరమణ రెడ్డి రేపు కోర్టుకు హాజరుకానున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. గతంలో ఆయన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తనయుడు మహమ్మద్ ఇలియాస్ పై అసత్యమైన పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేసినారు. ఇలియాజ్ పై రేప్ కేసులు ఉన్నాయని అసత్యమైన ఆరోపణలు అని తెలిసి మీడియాలో ప్రచారం చేశాడని తెలిపారు. ఇందుకుగాను ఇలియాసుద్దీన్ నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేసినారని వారి న్యాయవాది గరకరాజుల సుమంత్ తెలిపినారు. ఎమ్మెల్యే రమణారెడ్డి తాను చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి వివరణ ఇస్తారోనని కామారెడ్డి జిల్లా ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కేసుల ప్రత్యేక న్యాయస్థానం మే 20వ తేదీన కోర్టుకు హాజరుకావాలని ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కోర్టులో చేసే వాదనలు, ఆయన తరఫున సమర్పించే వివరణపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. కోర్టు విచారణ అనంతరం ఈ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
- Advertisement -



