వందల ఎక్కరాల్లో మొక్క జొన్న పంటలు దగ్ధం
నవతెలంగాణ-కుభీర్
రైతులకు ప్రతి ఏడాదిలో ఎదో ఒక రూపంలో నష్టం చూసే పరిస్థితి ఏర్పడుతుంది. రైతులు ఎంతో కష్ట పడి ఎండనక వాన అనక విత్తనాలు వేసిన నాటి నుంచి పంటలు చేతికి వచ్చే వరకు ఎన్నో ఇబ్బందులు ఎదురుకొని పంటలు పండిస్తున్నారు. అయితే ఈ ఏడాదైనా సరిగ్గా పంటలు పండి ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయన్న ఆశతో ఎదురుచూస్తున్న రైతులకు మొండిచేయే లభించింది. మండలంలో దాదాపుగా ఇప్పటివరకు వందల ఎకరాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఈ క్రమంలో మంగళవారం మండలంలోని దార్ కుభీర్ గ్రామానికి చెందిన కరుణ బాయి, శషిరావు పటేల్, సుదర్శన్ రైతుల మొక్క జొన్న, పసుపు, పంటకు మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పంట మొత్తం అగ్నికి ఆహుతైంది. వెంటనే గమనించిన గ్రామస్తులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో సుమారుగా రూ.15 ఎకరాలు మొక్కజొన్న, పసుపు కాలి బూడిదైంది. దీంతో సుమారుగా రూ.25 లక్షల వరకు నష్టం జరిగినట్లు రైతులు వాపోతున్నారు. ఇప్పటివరకు మండలంలోని ఫార్డి కే,మాలేగాం,పల్సి, తదితర గ్రామాల్లో మొక్కజొన్న జొన్న వంటలు అగ్ని ప్రమాదాల వల్ల పడిపోయిన సంఘటనలు మరొక ముందే మరో సంఘటన ఏర్పడింది. దీంతో ప్రభుత్వం నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామాల రైతులకు కోరుతున్నారు.



