– సీపీఐ(ఎం) ఖమ్మం అభ్యర్థి యర్రా శ్రీకాంత్
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం గ్రేయిన్ మార్కెట్‌ను తరలించాలనే కుట్రలు చేసిన చరిత్ర బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులదని, మార్కెట్ తరలింపును అడ్డుకొని పోరాడిన సీపీఐ(ఎం)కు ఓటేయండని పార్టీ అభ్యర్ధి యర్రా శ్రీకాంత్ అన్నారు. సీపీఐ(ఎం) విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక ఖమ్మం త్రీ టౌన్‌లోని గాంధీ చౌక్‌లో షాప్ టూ షాప్ తిరుగుతూ యర్రా శ్రీకాంత్ ఓట్లు అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చౌక్ సెంటర్లో పార్టీ త్రీ టౌన్ కార్యదర్శి భూక్య శ్రీను అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఖమ్మంలో రెండు కార్పొరేట్ శక్తులు ఎన్నికలలో డబ్బుతో గెలవాలని చూస్తున్నారని, వారు ఎప్పుడైనా కార్మికులు, ప్రజా సమస్యలపై పోరాడారా అన్ని ప్రజలు ఆలోచించి ఓటేయాలన్నారు. నిత్యం కార్మికులు, ప్రజల కోసం పనిచేస్తున్న తనకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.