Wednesday, May 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపింఛను డబ్బుల కోసం తండ్రిని కొట్టి చంపిన కొడుకు

పింఛను డబ్బుల కోసం తండ్రిని కొట్టి చంపిన కొడుకు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో పింఛను డబ్బుల కోసం తండ్రిని కొడుకు కర్రతో కొట్టి చంపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి సీకరి పంచాయతీ వెలుపాలెం గ్రామానికి చెందిన రమేష్‌ తన తండ్రి సింహాచలం (60)తో పింఛను డబ్బుల విషయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలో రమేష్‌.. తన తండ్రి తలపై కర్రతో బలంగా కొట్టడంతో సింహాచలం అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -