నవతెలంగాణ – రాయికల్: పట్టణ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో గురువారం తల్లుల సమావేశం నిర్వహించారు.వైస్ చైర్మన్ తురుగ సౌజన్య అధ్యక్షతన, సీడీపీఓ జయప్రద ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించి,పిల్లల బరువు,పొడవు పరిశీలించారు.ఈ సందర్భంగా సీడీపీఓ జయప్రద మాట్లాడుతూ చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని,ప్రీ స్కూల్ విద్య పిల్లల మానసిక,మేధో వికాసానికి పునాదిగా నిలుస్తుందని తెలిపారు.ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అంగన్వాడీల్లో నర్సరీ, ఎల్కేజీ,యూకేజీ స్థాయి బోధన అందిస్తున్నామని చెప్పారు.అనంతరం పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలు,మినీ అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు పద్మావతి, మమత, నాయకులు శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
చిన్నారుల మేధోవికాసానికి మూలం అంగన్వాడీ కేంద్రాలు: సీడీపీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



