- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తర్‌ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీకి చెందిన పర్యాటకులతో నైమిశారణ్యం నుంచి అయోధ్యకు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, పర్యాటక గైడ్ మృతి చెందారు. ఘటన సమయంలో నరసరావుపేట, చిలకలూరిపేటకు చెందిన 50 మంది బస్సులో ఉన్నారు. ప్రయాణికులందరికీ స్వల్పగాయాలయ్యాయి. లక్నో, అయోధ్య మీదుగా నేపాల్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు.
- Advertisement -



