- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మేడ్చల్, రంగారెడ్డి డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ నివాసాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు రూ.వందల కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. శేరిలింగంపల్లి, ఇతర ప్రాంతాల్లో ఆర్డీవోగా పనిచేసిన వంశీమోహన్.. భారీగా ప్రభుత్వ భూములు కాజేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. భూములను తన మామ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి.. ఆ తర్వాత రియల్టర్‌కు ధారాదత్తం చేసినట్టు అధికారులు గుర్తించారు. ఓ రియల్టర్ నుంచి 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్ చేయించుకున్నట్టు ఏసీబీ గుర్తించింది.
- Advertisement -



