- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరే శుభవార్త. ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు UIDAI మరో ఏడాది పాటు అవకాశం కల్పించింది. జూన్ 14, 2027 వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపింది. ఆధార్ హోల్డర్లు తమ ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను ఫ్రీగా అప్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఇందుకోసం myAadhaar పోర్టల్‌లో ఆధార్ నంబర్, OTPతో లాగిన్ అయి అప్డేట్ డాక్యుమెంట్‌పై క్లిక్ చేయాలి. రుజువు కోసం అవసరమైన డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయాలి. ఆధార్ సెంటర్లలో మాత్రం ఛార్జీలు వసూలు చేస్తారు.
- Advertisement -



