- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కీలక ఫైట్ జరగనుంది. ఏకనా స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడతాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ కు చాలా కీలకం. ఇందులో గనక ఓడిపోతే, పంజాబ్ ఇంటి దారి పట్టాల్సిందే. 13 పాయింట్లు సాధించిన పంజాబ్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. అయితే ఇవాళ లక్నో పైన గెలిస్తే 15 పాయింట్ల నాలుగో స్థానానికి చేరుతుంది. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్ ఓడిపోవాలి. అప్పుడే ప్లే ఆఫ్స్ కు పంజాబ్ దూసుకు వెళ్తుంది. అటు లక్నో ఇప్పటికే ఎలిమినేట్ కాగా, పరువు కోసం నేడు బరిలోకి దిగుతోంది.
- Advertisement -


