- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :దేశ రాజధాని ఢిల్లీ శాస్త్రి పార్క్ ప్రాంతంలో ఫర్నీచర్ మార్కెట్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంటల ధాటికి ఫర్నీచర్ షాప్స్ దగ్ధమైంది. ఫర్నీచర్స్, ప్లైవుడ్ కారణంగా.. షాపులకు మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ పెను ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రాణ నష్టం జరుగలేదని తెలుస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



