- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సందర్శిస్తున్నారు. ఈ మేరకు స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం పెద్దగుట్ట టెంపుల్‌సిటీలో వేద విజ్ఞాన వ్యాప్తి కోసం ఏర్పాటు చేయనున్న శ్రీలక్ష్మీనరసింహ వేదపాఠశాలకు సీఎం భూమిపూజ చేయనున్నారు. యాదగిరిగుట్టపై భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మరో నాలుగు అభివృద్ధి కార్యక్రమాలకు సైతం ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు.
- Advertisement -



