Saturday, May 23, 2026
E-PAPER
Homeక్రైమ్ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కర్ణాటకలోని కలబురగి జిల్లా లాడ్లాపూర్ సమీపంలో వేగంగా ప్రయాణిస్తున్న ఒక క్రూజర్ వాహనం, ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద ధాటికి క్రూజర్ ముందుభాగం పూర్తిగా ధ్వంసం అయింది. మృతులను క్యాష్వార్‌, హుస్సేన్‌ షా, మహబూబ్‌ అలీ, రసూల్‌ బీ, ఫాతిమా అలీలుగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -