Saturday, July 25, 2026
E-PAPER
Homeక్రైమ్పంటకాల్వలో మునిగి ముగ్గురి మృతి

పంటకాల్వలో మునిగి ముగ్గురి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : డాక్టర్‌ బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రామచంద్రపురం మండలం వెంకటయ్యపాలెంలో పంట కాల్వలో మునిగి ముగ్గురు మృతిచెందారు. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. తొలుత పావని (14) నీటిలో దిగి మునిగిపోవడంతో.. ఆమెను కాపాడేందుకు రంజిత్‌ (15), వీరేంద్ర (19) కూడా కాల్వలోకి దిగారు. ఈ క్రమంలో వారు ముగ్గురు గల్లంతయ్యారు. స్థానికులు గాలింపు చేపట్టి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మృతులు పసలపూడి, పడమర కండ్రిగ గ్రామాలకు చెందినవారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -