Saturday, May 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వీబీజీ రాంజీ నూతన చట్టాన్ని రద్దు చేయాలి

వీబీజీ రాంజీ నూతన చట్టాన్ని రద్దు చేయాలి

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
బిజెపి ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వి బి జి రామ్ జి నూతన చట్టాన్ని రద్దు చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని మేటి చందాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులను పరిశీలించి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కొనసాగించాలని  ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పిస్తూ రోజు కూలి 600 రూపాయలు పెంచాలని అదేవిధంగా రెండుసార్లు ఫోటో తీసే విధానాన్ని రద్దు చేయాలని అన్నారు.

నూతన విబిజి రాంజీ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే రద్దుచేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించాలని బడ్జెట్లో కేటాయింపులు సక్రమంగా విడుదల చేయాలని సంవత్సరానికి రూ.200 రోజులు పని దినాలు కల్పిస్తూ రోజు కూలి రూ.600 పెంచాలని అదేవిధంగా పనిముట్లు గడ్డపార పారా తట్టా గొడ్డలిని కూలీలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు ఏరుకొండ రాఘవేంద్ర,అయితగోని నరసింహ,లబ్బంగి ధనమ్మ,యాదమ్మ,ప్రమీల,ఊరు పక్క యాదమ్మ,మాడుగుల యాదయ్య,ఏర్కొండ రాములు,ఊరు పక్క వెంకటయ్య,శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -